తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి తెలుగు శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి’ సందర్భంగా “సురవరం ప్రతాపరెడ్డి ఈ తరానికి చెరగని స్ఫూర్తి” అన్న అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు జరిగింది.
ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి కిషన్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ భాషా సాహిత్యాలకు విశిష్ట ఘనచరిత్ర ఉన్నదని వాస్తవిక దృక్పథంతో రచనలు చేసిన ప్రముఖుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రథములని ఆయన సాహిత్య సేవలను కొనియాడారు. ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి గారు గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 20 కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించి గ్రంథాలయాన్ని స్థాపించారు సామాజిక చైతన్యానికి గ్రంధాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మరొక విశిష్టత అతిథి జాయింట్ డైరెక్టర్ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం డాక్టర్ డి ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన సేవలను కొనియాడారు. మరొక విశిష్టత జాయింట్ డైరెక్టర్ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం డాక్టర్ జి.యాదగిరి మాట్లాడుతూ గోల్కొండ పత్రికను గురించి పేర్కొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు మరొక గౌరవ అతిథి సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు డాక్టర్ సురవరం కృష్ణ వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ తనకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ ప్రారంభ సమావేశానికి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు అధ్యక్షత వహిస్తూ తెలంగాణ భాషా సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన సాహితీ వైతాళికుడు సురవరం అని కొనియాడారు.
0 Comments